🔥 TRENDING New Delhi Hosts Two-Day Power Minister... Indore to Experience Cooler Nights as... Salman Khan to Reveal ScoutOP and Gull... ಇಂಗ್ಲೆಂಡ್ 7 ವಿಕೆಟ್ ಜಯದಿಂದ 2‑1 ಮುನ್ನಡೆ,... Delhi High Court Grants TV Today Anti‑... Car Falls into 300‑Metre Gorge in Utta...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

18 గ్రామాల్లో సర్పంచ్ కోటేశ్వరరావు కృతజ్ఞతా పర్యటన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన నూతన సర్పంచ్.. అభివృద్ధికి కృషి చేస్తానని హామీ

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 29 Nov 2026, 08:34 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం రింతాడ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్‌గా ఎన్నికైన గుంట కోటేశ్వరరావు పంచాయతీ పరిధిలోని 18 గ్రామాల్లో కృతజ్ఞతా పర్యటన చేపట్టారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి మద్దతుతో విజయం సాధించిన ఆయన గ్రామాల్లో పర్యటిస్తూ తన గెలుపునకు సహకరించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు.ఏబులం కట్టువీధితో పాటు పలు గ్రామాల్లో పర్యటించిన కోటేశ్వరరావుకు స్థానిక ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, బొకేలు, శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. రింతాడ పంచాయతీలోని అన్ని గ్రామాల అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
📲Get App