🔥 TRENDING PM નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમ... దొడ్డికొండ సర్పంచ్ ఎన్నికలపై వైసీపీ నే... हजारीबाग पुलिस ने छठ पूजा पर श्रद्धालु... भागलपुर बरारी घाट पर छठ पूजा की आरग्या... लोक आस्था और सेवा का अनूठा संगम: जेन-ज... जफराबाद पुलिस का बड़ा खुलासा, बैंक में...
15 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

జీకే వీధిలో పంచాయతీ ఎన్నికల సందడి.. తొలిరోజే 16 నామినేషన్లు దాఖలు!

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 15 Nov 2026, 08:15 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
జీకే వీధి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో రాజకీయ సందడి నెలకొంది. తొలిరోజు మండలవ్యాప్తంగా సర్పంచ్ స్థానాలకు 6, వార్డు సభ్యుల స్థానాలకు 10 చొప్పున మొత్తం 16 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీఓ రమణబాబు వెల్లడించారు.

పంచాయతీల వారీగా నామినేషన్ల వివరాలు:

సర్పంచ్ స్థానాలకు గూడెంకొత్తవీధిలో 2, సంకాడ, రింతాడ, వంచుల, ఈదారకొండలో ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు సభ్యుల స్థానాలకు ఈదారకొండలో 5, గూడెంకొత్తవీధిలో 3, పెదవలస, రింతాడలో ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లు వచ్చాయి.ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుందని ఎంపీడీఓ తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని పేర్కొన్నారు.ప్రభుత్వం ఏకగ్రీవంగా ఎన్నికయ్యే గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహకాలు అందిస్తున్న నేపథ్యంలో గ్రామాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఏకగ్రీవ ఎన్నికలకు సహకరించాలని ఆయన కోరారు. ఎన్నికలు జరిగే పక్షంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఎంపీడీఓ రమణబాబు పిలుపునిచ్చారు.
📲Get App