ఈ నెల 12 న విజయనగరంలో ఐటీఐ అప్రంటీస్ మేళా
Watch on:
▶️ YouTube
అక్టోబర్ 12 న విజయనగరం ప్రబుత్వ ఐటీఐలో 'ప్రధాన్ మంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా' నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ , జిల్లా కన్వీనర్ జి.వి.వి.గిరి తెలిపారు. ఈ మేరకు ఐటీఐ కోర్సులు ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే ఈ మేళాకు అర్హులని, ఆరోజు ఉదయం 9 గంటలకు హాజరుకావాలని తెలిపారు. ఎంపికైన వారికి స్టైపెండ్ చెల్లిస్తారని ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హతల పత్రాలు, ఆధార్ కార్డు, రెండు ఫొటోలతో నేరుగా హాజరుకావాలని సూచించారు.