కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో 11వ వార్డు అభ్యర్థి తిమ్మరాజమ్మ ఇంటింటి ఎన్నికల ప్రచారం
Watch on:
▶️ YouTube
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఎన్నికలలో 11వ వార్డు రెవెన్యూ కాలనీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న తిమ్మరాజమ్మ రామన్న మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ కరపత్రాలు పంచి పెడుతూ ఎన్నికలలో కౌన్సిలర్గా గెలిపించాలని అభ్యర్థించారు. ఇంటి మహిళలకు కుంకుమ బొట్టు పెట్టి ఓటు వేసి ఆదరించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జ్ సునీల్, మణి,, మహిళా నాయకురాలు అరుణ పాల్గొన్నారు.