అదిలాబాద్ ప్రజావాణిలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ఆదిలాబాద్ కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. బోరజ్ మండలం మాండగాడ గ్రామానికి చెందిన దేవన్న భూ వివాదం నేపథ్యంలో అధికారులకు సమస్యను విన్నవించేందుకు ప్రజావాణికి వచ్చాడు. ఒక్కసారిగా మందు తాగాడు. గమనించిన స్థానికులు, పోలీస్ సిబ్బంది వెంటనే ఆటోలో రిమ్కు తరలించారు.