బతునూరులో పొత్తూరు రాజులమ్మ ఇంటింటి ప్రచారం గాలికొండ పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తా: సర్పంచ్ అభ్యర్థి రాజులమ్మ
గూడెంకొత్తవీధి మండలం గాలికొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ బలపరిచిన అభ్యర్థి పొత్తూరు రాజులమ్మ బతునూరు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.తాను సర్పంచ్‌గా ఎన్నికైతే పంచాయతీ పరిధిలో తాగునీరు, రహదారులు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొంటూ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరారు.ఈ ప్రచారంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పాల్గొన్నారు.