నేరడిగొండ సమస్యలపై కలెక్టర్‌కు మూడు వినతిపత్రాలు అందజేత.
నేరడిగొండ: మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల శిథిలావస్థ, పశు వైద్యశాల నూతన భవన నిర్మాణం, జాతీయ రహదారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సామాజిక కార్యకర్త సాబ్లే సంతోష్ సింగ్, బొంతుకుల శ్రీను సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు మూడు వినతిపత్రాలు సమర్పించారు. సమీకృత ప్రభుత్వ కార్యాలయ సముదాయం నిర్మించాలని, పశు వైద్యశాలకు కొత్త భవనం ఏర్పాటు చేయాలని, హైవేపై సర్వీస్ రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, ఫ్లైఓవర్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.