🔥 TRENDING सिवान के दरौंदा में ममता मेडिकल कॉलेज... గౌడ కులస్తుల కార్తీక వనభోజనాలు ఘనంగా న... काटरा में इलेक्ट्रिक और पेट्रोल ऑटो वि... Kumar Sanu calls 'Aashiqui' success a... अमृत 2.0 जलप्रदाय परियोजना में लापरवाह... Uttarakhand CM Dhami: State laws stric...
26 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

సీపీఎం కంచుకోటలో టీడీపీ జయకేతనం అమ్మవారి దారకొండ సర్పంచ్‌గా గుంట ఆనందరావు విజయం

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 26 Nov 2026, 05:31 PM 👁 35
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలంలోని అమ్మవారి దారకొండ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి గుంట ఆనందరావు సర్పంచ్‌గా విజయం సాధించారు. మండలంలో వెలువడిన తొలి సర్పంచ్ ఫలితం కావడంతో ఈ గెలుపు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.ఇప్పటివరకు సీపీఎంకు బలమైన పట్టున్న పంచాయతీలో తొలిసారిగా టీడీపీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి విజయం సాధించడం స్థానికంగా ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ ఫలితంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. సీపీఎం కంచుకోటగా పేరొందిన దారకొండలో టీడీపీ జెండా ఎగరడం మండల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
📲Get App