🔥 TRENDING 15 ವರ್ಷದ ವೈಭವ್ ಸೂರ್ಯವಂಶಿ 53 ಎಸೆತಗಳಲ್ಲಿ... નાસિકથી આવેલા પરિવારની કારમાં અકસ્માત,... ಭಾರತ 'ಎ' ತಂಡ ನಾಳೆ ದೋಹಾದ ಏಷ್ಯನ್ ಟೌನ್ ಸ್... અમદાવાદના સરખેજ‑ગ્યાસપુરમાં ગેસ સિલિન્... Tripura Woman Dies After Self-Immolati... ಪ್ರಿಯಾಂಶ್ ಆರ್ಯ 181 ರನ್‌ಗಳು, 19 ಸಿಕ್ಸರ್...
25 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం:గంట్లకుంట గ్రామంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ప్రాణాలు బలి కావాల్సిందేనా?

✍️ Reporter: Bommeraboina Hareesh 🗓 25 Nov 2026, 08:28 AM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ప్రాణాలు బలి కావాల్సిందేనా?

ఇంటి ఎదురుగా ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మూడేళ్లుగా మార్పు కోసం ఎదురుచూపులు.. అధికారులకు ఇంటి యజమాని సమ్మయ్య విజ్ఞప్తి

ప్రజల భద్రతను పట్టించుకోకుండా విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారా..? ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా..? అంటూ గంట్లకుంట గ్రామానికి చెందిన ఇంటి యజమాని మోడెం సమ్మయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన ఇంటి ఎదురుగా ప్రమాదకర స్థితిలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ను తక్షణమే తొలగించి, సురక్షితమైన ప్రదేశంలో ఏర్పాటు చేయాలని ఆయన విద్యుత్ శాఖ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం గంట్లకుంట గ్రామంలోని బస్టాండ్ చౌరస్తా సమీపంలో మోడెం సమ్మయ్య ఇంటి ఎదురుగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ను ఏర్పాటు చేశారు. అయితే, ఈ ట్రాన్స్ఫార్మర్ సీసీ రోడ్డు నుంచి సుమారు ఆరు అడుగుల ఎత్తులోనే ఉండటంతో అటుగా రాకపోకలు సాగించే ప్రజలకు ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి ముందు ట్రాన్స్ ఫార్మర్ ఉండటంతో కుటుంబ సభ్యులు, ముఖ్యంగా చిన్నపిల్లల భద్రతపై సమ్మయ్య ఆందోళన చెందుతున్నారు. నిత్యం ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతంలో ట్రాన్స్ ఫార్మర్ తక్కువ ఎత్తులో ఉండటం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ర్షాలు, గాలిదుమారాల సమయంలో ట్రాన్స్ ఫార్మర్ వద్ద మంటలు రావడం, విద్యుత్ స్పార్కులు కనిపించడం వంటి ఘటనలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయని సమ్మయ్య తెలిపారు.

ఈ సమస్యను పరిష్కరించాలని గత మూడేళ్లుగా పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించినట్లు ఆయన పేర్కొన్నారు. ట్రాన్స్ఫార్మర్ను అక్కడి నుంచి తొలగించి మరో సురక్షితమైన

ప్రదేశంలో ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
📲Get App