🔥 TRENDING चंबल में छोड़ े 20 'हाई-टेक' घड़ियालः... ਵੈਭਵ ਸੂਰਯਵੰਸ਼ੀ ਨੇ 52 ਗੇਂਦਾਂ 'ਚ UAE ਵਿਰ... ऐबरा मे ं महिला की करंट से मौतः खेत मे... నాగమణి గెలుపే లక్ష్యంగా గిడ్డి ఈశ్వరి... नमो नमो क्रांति फाउंडेशन में संगठन विस... దీనమణి విజయానికి కూటమి శ్రేణుల బలప్రదర...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

బుజ్జిబాబుకు మద్దతుగా ముమ్మర ప్రచారం మంచం గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఇంటింటా అభ్యర్థన

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 24 Nov 2026, 09:39 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
గూడెంకొత్తవీధి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి అంపురింగి బుజ్జిబాబు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గ్రామంలోని ప్రతి వీధిలో పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. రహదారులు, తాగునీరు, వీధి దీపాలు, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని పేర్కొంటూ మంచం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని బుజ్జిబాబు ఓటర్లను అభ్యర్థించారు.
📲Get App