దీనమణి విజయానికి కూటమి శ్రేణుల బలప్రదర్శన గంగులయ్య నేతృత్వంలో సీలేరులో భారీ ర్యాలీ.. బుట్ట గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి
సీలేరు గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కూటమి బలపరిచిన జనసేన అభ్యర్థి వంతల దీనమణి విజయమే లక్ష్యంగా కూటమి నాయకులు ప్రచారాన్ని హోరెత్తించారు. ఎన్నికల ప్రచార చివరి రోజున ఆంధ్రప్రదేశ్ జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్ వంపూరు గంగులయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.రామాలయం నుంచి మార్కెట్ సెంటర్ వరకు సాగిన ర్యాలీలో నాయకులు ప్రజలను, వ్యాపారులను కలుసుకుని దీనమణికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా గంగులయ్య మాట్లాడుతూ సీలేరు పంచాయతీ సమగ్ర అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. బుట్ట గుర్తుపై ఓటు వేసి వంతల దీనమణిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గొర్లె వీర వెంకట్, అభ్యర్థి వంతల దీనమణి, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.