🔥 TRENDING चंबल में छोड़ े 20 'हाई-टेक' घड़ियालः... ਵੈਭਵ ਸੂਰਯਵੰਸ਼ੀ ਨੇ 52 ਗੇਂਦਾਂ 'ਚ UAE ਵਿਰ... ऐबरा मे ं महिला की करंट से मौतः खेत मे... నాగమణి గెలుపే లక్ష్యంగా గిడ్డి ఈశ్వరి... नमो नमो क्रांति फाउंडेशन में संगठन विस... దీనమణి విజయానికి కూటమి శ్రేణుల బలప్రదర...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

అఖండ హరినామ సప్తాహంలో పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 24 Nov 2026, 09:38 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
గంగాపూర్: బజార్‌హత్నూర్ మండలంలోని గంగాపూర్ గ్రామంలో నిర్వహించిన అఖండ హరినామ సప్తాహ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, భక్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హరినామ సంకీర్తనలు, భజనలు మానసిక ప్రశాంతతను అందించడంతో పాటు భక్తిభావం, ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. కార్యక్రమ నిర్వాహకులు, గ్రామ పెద్దలను అభినందించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
📲Get App