కొండాపూర్‌లో నూతన చేయూత పింఛన్ల పంపిణీ
సిరికొండ: ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు మండలంలోని కొండాపూర్ గ్రామపంచాయతీలో స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో నూతన చేయూత పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌పీఓ ఫణిందర్, ఎంపీడీఓ సంతోష్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కంచం లక్ష్మణ్, ఉపసర్పంచ్ బాదు పటేల్, మార్కెట్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు.