బీడీ కార్మికులు, వృద్ధులకు వెంటనే పెన్షన్లు అందించాలి: బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
రూ.200 పెన్షన్‌ను రూ.2,016కు పెంచిన ఘనత కేసీఆర్‌దే
బజార్‌హత్నూర్: మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్స్‌లో శనివారం నిర్వహించిన చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి స్వాగతం పలికారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ పాలనలో రూ.200గా ఉన్న పెన్షన్‌ను కేసీఆర్ ప్రభుత్వం రూ.2,016కు పెంచిందన్నారు. ఎన్నికల సమయంలో రూ.4,000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు నెలకు రూ.2,500, స్కూటీలు ఇస్తామని ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలన్నారు.
మహిళల అభివృద్ధి గురించి మాట్లాడుతున్న ప్రభుత్వం బీడీ కార్మికులకు ఎందుకు పెన్షన్లు అందించడం లేదని ప్రశ్నించారు. ప్రచారాలకు, ప్లకార్డులకు పరిమితం కాకుండా బీడీ కార్మికులు, వృద్ధులకు తక్షణమే పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఆయా గ్రామాల సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.