🔥 TRENDING *ग्रेटर खैरथल की ग्रेटर तस्वीर* Indian Man Sentenced to Over 19 Years... Bhuvan Bam's 'Dhindora Season 2 X' Spa... Xiaomi Raises Prices on Pad 8 and Redm... TVLine Ranks Top 80s Historical Dramas Avengers: Endgame Shatters Box Office...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

💐 ధూపం వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు. 💐

✍️ Reporter: బోయ రాజు 🗓 21 Nov 2026, 06:49 AM 👁 28
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఎర్రకోట గ్రామానికి చెందిన ధూపం ఆంజనేయులు గారి కుమార్తె చిరంజీవి ధూపం మహాలక్ష్మి మరియు విభూతి రమేష్ గారి వివాహ మహోత్సవం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో అంగరంగ వైభవంగా, అత్యంత ఘనంగా జరిగింది.ఈ శుభకార్యానికి ముఖ్య అతిథిగా ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు హాజరై నూతన వధూవరులు ధూపం మహాలక్ష్మి, విభూతి రమేష్‌లను ఆశీర్వదించారుఈ సందర్భంగా నూతన దంపతులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలత అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో కలకాలం అన్యోన్యంగా జీవించాలని ఆకాంక్షిస్తూ తన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ వేడుకలో కుటుంబ సభ్యులు బంధువులు, గ్రామ పెద్దలు, అభిమానులు, ఆత్మీయులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
💐 నూతన వధూవరులకు హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు! 💐
📲Get App