🔥 TRENDING BSF Arrests Pakistani National Along I... Mehbooba Criticizes NC Govt Over Exam... ମଞ୍ଚେଶ୍ୱରରେ ବାଲିଯାତ୍ରା ଅବସରରେ ଯାନ ଚଳାଚ... North Kashmir Drug Raid Seizes Rs 6 Cr... प्रकृति की सुंदरता से सजा क्षेत्र में... James Anderson and Lincoln Furtado Win...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

సర్పంచ్ ఎన్నికలలో అప్రమత్తంగా ఉండండి- గెలుపే లక్ష్యంగా ఓటర్లతో మమేకం అవ్వండి

✍️ Reporter: Kande Linga Prasad 🗓 21 Nov 2026, 09:05 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా సంయమనం పాటించాలని, ఎవరైనా అల్లర్లు సృష్టించినా, ఎన్నికల ప్రక్రియలో అవకతవకలకు పాల్పడినా వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు.శుక్రవారం సర్పంచ్ అభ్యర్థులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే ఎgన్నికల ప్రచారం, పోలింగ్, కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సమయంలో ఏవైనా అభ్యంతరాలు, నిబంధనల ఉల్లంఘనలు చోటుచేసుకుంటే సంబంధిత రిటర్నింగ్ అధికారికి (ఆర్వో) లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎవరైనా గొడవలకు దిగినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా సంబంధిత ఎస్సై లేదా పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని తెలిపారు. కౌంటింగ్ సమయంలోనూ అభ్యర్థులు, ఏజెంట్లు అప్రమత్తంగా ఉండి ప్రతి అంశాన్ని నిశితంగా గమనించాలని పేర్కొన్నారు. ఎన్నికలకు మిగిలిన ఈ నాలుగు రోజులు అభ్యర్థులకు ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను వివరించి ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలిసి ఓటు అభ్యర్థించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గోళ్ళ వెంకటేశులు, మార్కెట్ కమిటీ చైర్మన్ బోయ లక్ష్మీదేవి, కంబదూరు మాజీ సర్పంచ్ శ్రీరాములు, దండా వెంకటేశులు సీనియర్ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
📲Get App