🔥 TRENDING ‘Scene’ Marks 15-Day Box Office Milest... Avengers: Doomsday Surpasses Rs 30 Cro... ENE Repeat Opens to Rs 11.30 Cr Worldw... DMK Uses GTA Buzz to Criticise Governm... Tamil Nadu Adds 1,695 Nursing Posts, A... VS Babu in the Spotlight of Silent Inc...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం లొ ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు!

✍️ Reporter: Bommeraboina Hareesh 🗓 20 Nov 2026, 07:13 AM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
పెద్దవంగర నవంబర్ 19:NEED 24NEWS

భారతదేశ శ్రేయస్సు, ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా తన జీవితాన్ని అంకితం చేసి, దేశ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన ఉక్కు మహిళ, మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పెద్దవంగర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రంగు మురళి గౌడ్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ ప్రజల సంక్షేమం, అభివృద్ధి, ఐక్యత కోసం ఆమె చేసిన విశేష సేవలను కాంగ్రెస్ నాయకులు స్మరించుకున్నారు. దేశం కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహోన్నత నాయకురాలిగా ఇందిరాగాంధీ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పన్నీర్ వేణు, దాసరి శ్రీనివాస్, సీతారాం నాయక్, ముత్తినేని సోమన్న, ధరావత్ రమేష్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
📲Get App