🔥 TRENDING Sonia Gandhi's Memoir 'Belonging' Revi... Trump Secures Critical Minerals Deals... Modi Administration Uses Visa and OCI... India vs New Zealand: Stakes for India... India Gears Up for Tough Test Series i... Jay Shah Reappointed as BCCI Secretary...
18 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

వైసీపీకి గుడ్ బై - టిడిపిలో చేరిన ఎం. వెంకటం పల్లి గ్రామస్తులు

✍️ Reporter: Kande Linga Prasad 🗓 18 Nov 2026, 08:06 AM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

కళ్యాణదుర్గం మండలం ఎం. వెంకటాంపల్లి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గ్రామానికి చెందిన ఏడు కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. బోయ సోమశేఖర్, బోయ గణేష్, బోయ లింగప్ప, బోయ పాపన్న, షేక్ బాషా తదితరుల కుటుంబ సభ్యులు బుధవారం అనంతపురం నగరంలోని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్వగృహంలో ఆయన సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకుడు ఏరాసు ప్రతాప్ రెడ్డి వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
📲Get App