🔥 TRENDING Khaas report mr Nazir Ahmad Sofi காரைக்குடியில் போலீசார் கொடி அணி வகுப்... ਕੈਨੇਡਾ ਦੇ ਕਿਚਨਰ ਗੁਰਦੁਆਰਾ ਸਾਹਿਬ ਵਿੱਚ ਘਟ... રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ’ના અવસરે ચી... बहराइच में केडीसी के पास सड़क बस का टक... શાકભાજી નીઆડમાવિદેશીદારુનીહેરાફેરીનો પ...
15 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

సంకాడ సర్పంచ్ బరిలో కూటమి అభ్యర్థి ఊలం ఈశ్వర్ రావు.. అభివృద్ధే ప్రధాన అజెండా! గ్రామ సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని వెల్లడి

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 15 Nov 2026, 09:16 PM 👁 20
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
సంకాడ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో జనసేన ,తెలుగుదేశం, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా ఊలం ఈశ్వర్ రావు నిలిచారు. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యాలుగా ప్రకటిస్తూ ప్రజల మద్దతు కోరుతున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో తాగునీటి సమస్యల పరిష్కారం, అంతర్గత రహదారుల అభివృద్ధి, పారిశుధ్యం, విద్య, వైద్య సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రతి గ్రామానికి సమానంగా అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా గ్రామ భవిష్యత్తు కోసం అంకితభావంతో పనిచేయాలనే సంకల్పంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.మన గ్రామం , మన అభివృద్ధి, మన భవిష్యత్తు అనే నినాదంతో ప్రజల ఆశీర్వాదం కోరుతూ ఊలం ఈశ్వర్ రావు ఎన్నికల బరిలో ముందుకు సాగుతున్నారు.
📲Get App