🔥 TRENDING Tamil Nadu Rejects Karnataka's Mekedat... Draft Electoral Rolls for 2027 SSR Rel... Rajasthan medical officer nabbed in Rs... Rajasthan Government to Celebrate 3 Ye... Two suspects arrested as locals stop c... Two suspects arrested near Jalandhar t...
12 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

పేద ప్రజలకు అండగా ఆసరా పెన్షన్లు ఎమ్మెల్యే అనిల్ జాదవ్

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 12 Nov 2026, 07:17 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
బోథ్: అర్హులైన పేద ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యమని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఈరోజు బోథ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 552 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార్డుల ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఆసరా పెన్షన్లు ఎంతో అండగా నిలుస్తాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
📲Get App