🔥 TRENDING करौली जिला कलेक्टर ने मंडरायल में चुना... Supreme Court Collegium to Draft Objec... 77% of Overseas-returning Medical Cand... बाढ़ अनुमंडल के पंडारक थाना क्षेत्र के... अंबेडकर नगर के कायस्थ समाज ने मीरानपुर... Dhinchak Pooja Announces Pregnancy Six...
12 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కుకు ఈ-కేవైసీ తప్పనిసరి! చింతపల్లి కో-ఆపరేటివ్ సొసైటీ సభ్యులకు చైర్‌పర్సన్ గెమ్మెలి అబ్బాయి నాయుడు సూచన

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 12 Nov 2026, 07:08 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
త్వరలో నిర్వహించనున్న చింతపల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం (కో-ఆపరేటివ్ సొసైటీ) ఎన్నికల నేపథ్యంలో సభ్య రైతులందరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సొసైటీ చైర్‌పర్సన్ గెమ్మెలి అబ్బాయి నాయుడు సూచించారు.ఈ మేరకు సొసైటీలోని రైతు సభ్యులకు ఇప్పటికే సమాచారం అందించినట్లు ఆయన తెలిపారు. ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చింతపల్లి కో-ఆపరేటివ్ సొసైటీ కార్యాలయానికి చేరుకుని ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని కోరారు.ఈ ప్రక్రియ కోసం రైతులు తమ ఆధార్ కార్డు, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ ఫోన్‌ను వెంట తీసుకురావాలని సూచించారు. రాబోయే సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కుకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందస్తుగా ఈ-కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలని అబ్బాయి నాయుడు తెలిపారు. రైతు సభ్యులందరూ ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
📲Get App