దీపావళి వెలుగులు ప్రతి ఇంటా సుఖసంతోషాలు నింపాలి: కలెక్టర్
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని కలెక్టర్ రాజర్షిషా ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి దీపావళి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన ఆశలు, ఆనందాలు, సానుకూల ఆలోచనలు నింపాలని ఆకాంక్షించారు. దీపావళి పండుగ సమాజంలో ఐక్యత, సోదరభావం, ప్రేమానురాగాలను పెంపొందించాలని అన్నారు.