ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక దండారి ఉత్సవాలు -ఎమ్మెల్యే అనిల్ జాదవ్
గుడిహత్నూర్: మండలంలోని మచ్చపూర్ కొలంగూడ గ్రామంలో నిర్వహించిన దండారి (గుస్సాడి) ఉత్సవాల్లో బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంప్రదాయ నృత్యాలు, డప్పు వాయిద్యాల మధ్య సందడి చేశారు. దండారి ఉత్సవాలు ఆదివాసీల సంస్కృతి, ఐక్యతకు ప్రతీకలని, పూర్వీకుల ఆచారాలు, కళలను భావితరాలకు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు, కార్యకర్తలు, ఆదివాసీ పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.