🔥 TRENDING Ramayana Day 5 Surpasses Opening Day i... Arunachal Pradesh Karateka Clinches Go... Shakyamuni Buddha relics reach Bomdila... Arunachal U19 to Face Meghalaya U19 in... Two‑Way Traffic Restored on Jammu‑Srin... J&K Police Orders Reshuffle, Probation...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఎమ్మెల్యే సురేంద్రబాబును సన్మానించిన విజేతలైన ప్రజాప్రతినిధులు

✍️ Reporter: Kande Linga Prasad 🗓 08 Nov 2026, 08:09 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించిన ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలలో విజేతలైన ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజావేదికలు అభిమానునేత ఎమ్మెల్యే సురేంద్రబాబును కలుసుకొని విజయోత్సవ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు యాదవులతో పుష్పమాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. కళ్యాణదుర్గం జడ్పిటిసి గా ఎన్నికైన గోళ్ళ వెంకటేశులు సతీమణి బోయలక్ష్మి ఎమ్మెల్యే చేతుల మీదుగా డెకరేషన్ అందుకుని కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం శాలువాతో సన్మానించి గజమాలతో సత్కరించారు. అలాగే కుందుర్పి జడ్పిటిసి ప్రభావతి, ప్రమోసముద్రం ఎంపీటీసీ పాల బండ్ల శ్రీరాములు, శెట్టూరు జడ్పిటిసి రాజేశ్వరి, ప్రత్యేక పరిస్థితులలో ఎమ్మెల్యే ఆశీస్సులతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వేముల శారద ఎమ్మెల్యే సురేంద్రబాబులు శాలువతో సన్మానించి పూలమాలలతో సత్కరించారు. వీరితోపాటు నియోజకవర్గ వ్యాప్తంగా ఐదు మండలాల నుండి ఎన్నికైన ఎంపీటీసీలు ఎమ్మెల్యేలు కలుసుకొని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేంద్రబాబు మాట్లాడుతూ కళ్యాణ్ దుర్గం నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్ది రాష్ట్రం కళ్యాణదుర్గం వైపు చూసేలా అభివృద్ధి చేయడంలో నూతన ప్రజాప్రతినిధులు సైనికుల్లా పని చేయాలని సూచించారు. అలాగే కళ్యాణదుర్గం మున్సిపాలిటీని కూడా సుందర నగరంగా తీర్చిదిద్దరంలో కృషి జరగాలని పిలుపునిచ్చారు.
📲Get App