ఆదిలాబాద్ కలెక్టర్ చొరవతో ఉచిత ఓపెన్ హార్ట్ సర్జరీ
ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక చొరవతో భోరజ్ మండలం పూసాయి గ్రామానికి చెందిన ఏడేళ్ల అంజికి హైదరాబాద్లోని ఓ ఆసుపత్రి యాజమాన్యం రూ.7 లక్షల విలువైన ఓపెన్ హార్ట్ సర్జరీని ఉచితంగా చేయించేందుకు ముందుకొచ్చింది. చికిత్స ఖర్చుతో పాటు భోజనం, రవాణా సౌకర్యాలు కల్పిస్తోంది. ఇదే శిబిరంలో గుండె సమస్యలు గుర్తించిన మరో 40 మంది చిన్నారులకు కూడా దశలవారీగా ఉచిత వైద్యం అందించనుంది.