🔥 TRENDING ધારી તાલુકાના મોણવેલ ગામે કિસાન ઉત્સવ... Sikkim Conducts Recce Ahead of 2026 Ad... Sikkim Arts & Literature Festival 2026... Father Beaten to Death After Arriving... Four Reserved Festival Special Trains... Rain brings chill to Delhi, residents...
30 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ప్రతిపక్షంలో ఉన్న అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తా: ఎమ్మెల్యే

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 30 Oct 2026, 04:31 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
సిరికొండ: అధికారంలో లేకున్నా.. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నిత్యం ప్రజల మధ్యే ఉంటూ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం సిరికొండ మండలం పొన్న గ్రామంలో రూ.1.17 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా గ్రామస్థులు ఎమ్మెల్యేకు డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ.. గత రెండు నెలల క్రితం ఓ రైతు పంట కుప్ప వద్ద తన జొన్న పంటను అమ్ముకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకి పాల్పడితే ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క రూపా కూడా ఇవ్వలేదని ఆరోపించారు. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూ.3లక్షల ఆర్థిక సహాయం చేశారని గుర్తు చేశారు. రైతు పక్షపాతి కేసీఆర్ అని రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. నవంబర్ 1న తలమడుగు మండలంలో ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న నలుగురు రైతు కుటుంబాల‘ పరామర్శించడానికి కేటీఆర్ రానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భారతి, ఎంపీవో నాయకులు చౌహాన్ సూర్యకాంత్, పెంటన్న, కదం సూర్యకాంత్, చందు, భానుదాస్, ఈశ్వర్,ఇక్బాల్, రంజాన్ తదితరులు పాల్గొన్నారు.
📲Get App