మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో 513 మంది లబ్ధిదారులకు నూతన పింఛన్ల మంజూరు –పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి..
పెద్దవంగర: పాలకుర్తి నియోజకవర్గంలోని పెద్దవంగర మండల కేంద్రంలో ఉన్న సాయి గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమంలో 513 మంది అర్హులైన లబ్ధిదారులకు నూతన పింఛన్లను మంజూరు చేసిన పాలకుర్తి శాసనసభ్యురాలు శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి గారు.
ఈ సందర్భంగా *ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మాట్లాడుతూ..* ప్రజల సంక్షేమం, పేదల అభ్యున్నతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, వృద్ధులకు, వితంతువులకు, దివ్యంగులకు అండగా నిలవాలని ఉద్దేశంతో అర్హులైన వారికి నూతన పెన్షన్ లను మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పెన్షన్ అనేది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, వృద్ధాప్యంలో ఉన్నవారికి, జీవనోపాధికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు ప్రభుత్వం కల్పిస్తున్న ఆర్థిక భరోసా అని అన్నారు. ప్రతి నెలా అందే పెన్షన్ ద్వారా లబ్ధిదారులు తమ నిత్యావసర అవసరాలను తీర్చుకోవడంతో పాటు గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగించేందుకు తోడ్పాటు లభిస్తుందని పేర్కొన్నారు.
పెద్దవంగర మండలంలో ఒకేసారి 513 మంది అర్హులైన లబ్ధిదారులకు నూతన పెన్షన్లను మంజూరు చేయడం సంతోషకరమైన విషయమని ఎమ్మెల్యే తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రజల అవసరాలను గుర్తించి వారి సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, పేదలు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద కుటుంబాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు.
నూతనంగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. తమకు పింఛన్లు మంజూరు కావడం ఎంతో ఆనందంగా ఉందని, ఆర్థికంగా తమకు ఈ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, సంబంధించిన అధికారులు, నూతన పెన్షన్ లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.