🔥 ट्रेंडिंग ଡଭା ହତ୍ୟାକାଣ୍ଡ: ଝାରବନ୍ଧ ପୋଲିସ ଅଭିଯୁକ୍ତ... 16 वी राव जागीरदार क्रिकेट प्रतियोगिता... લીલીયા તાલુકામાં ડબલ હત્યા: પોલીસએ 60... दिल्ली में दिवाली पर ए.क्यू.आई बढ़ने स... दिल्ली के महापौर ने सफाई व्यवस्था का न... डेंगू के मामले एक हफ्ते में 13% घटे, स...
10 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఎంపీటీసీ గెలిచిన గ్రామంలోనే గొడ్డలి పార్టీ కి ఎదురుదెబ్బ..టిడిపి ఇన్చార్జి వర్యుల సమక్షంలో వైసీపీ శ్రేణుల 100 కుటుంబాలు టీడీపీలోకి

✍️ रिपोर्टर: బోయ రాజు 🗓 10 नव. 2026, 10:09 PM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రాలయం నియోజకవర్గంలో మరో భారీ గొడ్డలి పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల జరిగిన మంత్రాలయం మండల ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన వగురురూ గ్రామం నుంచే సుమారు 100 కుటుంబాలకు చెందిన వైసీపీ నాయకులు షాకీర్ దొర, షాచిర్ దొర, డీలర్ రఫీక్, హుసేని, మాజీ సర్పంచ్ నరసింహులు మాజీ ఎంపిటిసి తిక్కన్న, బుజ్జప్ప, మహమ్మద్ హుసేని, హేదర్,దాదా, షబ్బీర్ మరియు వెంకటరాముడు మరియు తదితరులకు మంత్రాలయం టీడీపీ ఇంచార్జి శ్రీ ఎన్.రాఘవేంద్ర రెడ్డి గారు వారి సోదరులు శ్రీ ఎన్.రఘునాథ్ రెడ్డి గారు మంచాల సొసైటీ చైర్మన్ శ్రీ రామకృష్ణ రెడ్డి గారి సమక్షంలో చేరారు.
ఈ సందర్భంగా రాఘవేంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విజయం సాధించినప్పటికీ, అదే గ్రామానికి చెందిన పెద్ద సంఖ్యలో ఎన్నికల ఫలితాలకే పరిమితం కాకుండా గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం దిశగా మన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు మరియు భవిష్యత్తు నాయకులు నారా లోకేష్ గారు అడుగులు వేస్తున్నారని అదేవిధంగా పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కుటుంబ సభ్యుడిగా భావిస్తూ వారి కష్టసుఖాల్లో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతమే నా ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు
పార్టీలోకి కొత్తగా చేరిన నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ రాఘవేంద్ర రెడ్డి గారి నాయకత్వంపై నమ్మకంతో,ఆయన చేస్తున్న ప్రజా సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని తెలిపారు. పార్టీ అభివృద్ధికి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ప్రకటించారు
ఈ కార్యక్రమంలో కల్లుదేవకుంట సొసైటీ చైర్మన్ రాఘమ్మా,జిల్లా జనరల్ సెక్రటరీ మద్దిలేటి,పవన్,గోపాల్,వీరారెడ్డి, లింగప్ప మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
📲Get App