రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సంఘ భవనం ప్రారంభం
మహిళల అభివృద్ధికి కృషి చేస్తా: బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
గుడిహత్నూర్: మండలంలోని కొల్హారి గ్రామంలో రూ.10 లక్షలతో నూతనంగా నిర్మించిన మహిళా సంఘ భవనాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జాయింట్ కలెక్టర్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం భవన ఆవరణలో మొక్క నాటి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. గ్రామ అభివృద్ధికి ప్రజల ఐక్యత ఎంతో ముఖ్యమని, గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఏపీవో, గ్రామ సర్పంచ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.