🔥 TRENDING Rising Dearness Allowance Sparks Calls... NDA ally suspends Bihar MLA Ram Pukar... Bihar CM Samrat Choudhary credits PM M... भागलपुर पुलिस ने 10.30 ग्राम स्मैक के... Supreme Court bench says new Form 6 no... नगर चौकी पर रोकी गई समाजसेवी चंद्रशेखर...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sports

ఇండియా మరియు విండీస్ మధ్య జరిగిన మూడవ T 20 లో విజయం సాధించిన భారత్ జట్టు.

✍️ Reporter: Thalapally Kranti Kumar 🗓 12 Oct 2026, 06:04 PM 👁 25
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఇండోర్ వేదికగా భారత్ మరియు వెస్ట్ ఇండీస్ మధ్య జరిగిన 3 వ T20-లో భారత్ 14 పరుగుల తేడాతో వెస్ట్ ఇండీస్ పై విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. రెండు మార్పులతో బరిలో దిగిన భారత్, జోసెఫ్ వేసిన మొదటి ఓవర్-లో ఓపెనర్ సంజూ శాంసన్ ( 3 )పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. మరొక ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 30 బంతులు 69 పరుగులు చేయగా, ఇషాన్ కిషన్ (37), తిలక్ వర్మ (28) పరుగులు చేశారు. భారీ లక్ష్య చేదనలో లో బరిలో దిగిన విండీస్ 209 పరుగులు మాత్రమే చేసింది. విండీస్ టీం లో హాట్మైర్ (43), నికోలస్ పూరన్ (42) పరుగులు చేయగా, చివర్లో శ్యామర్ స్ప్రింగర్ కేవలం 11 బంతుల్లో 38 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడిన జట్టును గెలిపించలేకపోయాడు. ఇండియా లెఫ్ట్రామ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ 44 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్-గా నిలిచాడు.
కాగా 5 మ్యాచ్-ల సిరీస్-లో ఇండియా 2-1 తేడాతో ముందంజలో ఉంది. 4వ మ్యాచ్ 14వ తేదీన హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లో రాత్రి 7:00 కు ప్రారంభమవుతుంది.
📲Get App