గూడెంకొత్తవీధి వారపు సంత వాయిదా గురువారం బదులు శుక్రవారం నిర్వహణ: ఎంపీడీఓ రమణబాబు
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండల కేంద్రంలో గురువారం జరగాల్సిన వారపు సంతను శుక్రవారానికి వాయిదా వేసినట్లు ఎంపీడీఓ రమణబాబు తెలిపారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండల కేంద్రంలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.ప్రజలు, వ్యాపారులు ఈ మార్పును గమనించి గురువారం సంతకు రావద్దని, శుక్రవారం సంతకు హాజరుకావాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలు, వ్యాపారులు అధికారులకు సహకరించాలని ఎంపీడీఓ రమణబాబు విజ్ఞప్తి చేశారు.