గాలికొండ అభివృద్ధికి నాగమ్మకు అవకాశం ఇవ్వండి చట్రాపల్లిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన కూటమి శ్రేణులు
గాలికొండ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి కొర్ర నాగమ్మకు మద్దతుగా కూటమి నాయకులు ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు. మంగళవారం చట్రాపల్లి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి నాగమ్మ విజయానికి సహకరించాలని కోరారు.ఈ సందర్భంగా నాగమ్మ మాట్లాడుతూ గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కొర్ర నాగమ్మను భారీ మెజార్టీతో గెలిపించాలని కూటమి నాయకులు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.