🔥 TRENDING ଧର୍ମେନ୍ଦ୍ରଙ୍କ ପ୍ରଥମ ଶ୍ରାଦ୍ଧବାର୍ଷିକୀ; ଗ... गंडक नदी के कटाव से सिसवा मंगलपुर गांव... स्कूल के छात्र को आने-जाने का रास्ता... ଝଲସିବ ସିଲଭର ସିଟି; ପ୍ରଥମଥର ଐତିହାସିକ ବାଲ... ଦଶମ ଶ୍ରେଣୀର ଛାତ୍ରଙ୍କୁ ଛୁରୀ ଭୁସିଲା ଅନ୍ୟ... BJP and Akali Dal Form Alliance to Con...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

పెద్దవంగర మండలం: గ్రామాల్లో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..

✍️ Reporter: Bommeraboina Hareesh 🗓 24 Nov 2026, 02:45 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
పెద్దవంగర, నవంబర్ 24 (నీడ్ 24న్యూస్)

కాన్వాయ్ గూడెం గ్రామ ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ కాసాని హరీష్ కోరారు. ఈ పథకం ద్వారా 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల అర్హులైన కుటుంబ సభ్యులకు జీవిత బీమా సౌకర్యం అందిస్తున్నట్లు తెలిపారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే, కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా

పరిహారం అందించే అవకాశం ఉందన్నారు. బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తుందని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసే ప్రత్యేక నమోదు శిబిరాలను అర్హులైన గ్రామస్తులు సంప్రదించి తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. నమోదు సమయంలో కుటుంబ పెద్ద ఆధార్ కార్డు, మొబైల్ నంబర్, నామినీ వివరాలను సంబంధిత అధికారులకు అందించాలని తెలిపారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే ఈ పథకంలో అర్హులైన వారందరూ పాల్గొని తమ కుటుంబ భవిష్యత్తుకు భరోసా కల్పించుకోవాలని సర్పంచ్ కాసాని హరీష్ విజ్ఞప్తి చేశారు.

23 Nov 2026-Praja Prathibha - Page 7
📲Get App