అఖండ హరినామ సప్తాహంలో పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
గంగాపూర్: బజార్హత్నూర్ మండలంలోని గంగాపూర్ గ్రామంలో నిర్వహించిన అఖండ హరినామ సప్తాహ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, భక్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హరినామ సంకీర్తనలు, భజనలు మానసిక ప్రశాంతతను అందించడంతో పాటు భక్తిభావం, ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. కార్యక్రమ నిర్వాహకులు, గ్రామ పెద్దలను అభినందించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.