తొర్రూర్ పట్టణంలో నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మార్కెట్ చైర్మన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డి.
పెద్దవంగర మండలంలోని బొమ్మకల్ గ్రామానికి చెందిన బీరగని మల్లయ్య కుమార్తె వివాహ వేడుక శుక్రవారం రామ ఉపేందర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకకు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం వధూవరుల కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొమ్మకల్ గ్రామ సర్పంచ్ కొడకంటి యాకయ్య, కేతిరెడ్డి విక్రమ్ రెడ్డి, రమేష్, గిరగని రామస్వామి, యాదగిరి, తొర్రూరు మండల సీనియర్ నాయకులు అనుమాండ్ల నరేందర్ రెడ్డి, అనుమాండ్ల ప్రవీణ్ రెడ్డి, ధర్మారపు వంశీకృష్ణ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.