ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా జీకే వీధి ఎంపీటీసీ బొబ్బిలి లక్ష్మణ్ రావు కృతజ్ఞతలు
ఎంపీటీసీ ఎన్నికల్లో తనకు ఓటు వేసి ఆదరించిన ప్రతి ఓటరుకు బొబ్బిలి లక్ష్మణ్ రావు కృతజ్ఞతలు తెలిపారు. తన విజయానికి సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సహకారం మరువలేనిదని పేర్కొన్నారు.ప్రజలు తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని, మండల పరిధిలోని గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి చేరేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటానని చెప్పారు. పదవి ద్వారా ప్రజలకు మరింత చేరువై సేవలందించడమే తన లక్ష్యమని బొబ్బిలి లక్ష్మణ్ రావు వెల్లడించారు.