🔥 TRENDING Sikkim to Host 3rd All‑India Judges Ba... जैसलमेर में विधायक महंत प्रतापपुरी महा... Bee Swarm Attacks Students at Indore C... बिहार के स्वास्थ्य मंत्री निशांत कुमार... தலைஞாயிறு வேளாண்மை உதவி இயக்குனர் அலுவ... राष्ट्रीय लोक अदालत को लेकर शेखपुरा मे...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

జీకే వీధి మండల పగ్గాలు వైఎస్సార్సీపీకి ఎంపీపీగా పూజారి లీలా ప్రసాద్, వైస్ ఎంపీపీగా బాకూరు రాజేశ్వరి ఎన్నిక

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 19 Nov 2026, 09:58 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండల పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులను దక్కించుకున్నారు. గూడెంకొత్తవీధి ఎంపీటీసీ పూజారి లీలా ప్రసాద్ ఎంపీపీగా, ధారకొండకు చెందిన బాకూరు రాజేశ్వరి వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు.ఎంపీపీగా ఎన్నికైన పూజారి లీలా ప్రసాద్ మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన ఎంపీటీసీ సభ్యులకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు, మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.ఎన్నికల అనంతరం నూతన ఎంపీపీ, వైస్ ఎంపీపీలకు వైఎస్సార్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పూలమాలలు, శాలువాలతో సత్కరించి పూల వర్షం కురిపిస్తూ అభినందనలు తెలిపారు.
📲Get App