🔥 TRENDING Meghalaya Transfers Baljek Airport to... Meghalaya Cabinet Chooses Long‑Term Bo... Rakesh Sharma Criticizes Haryana Govt... Stray Bull Fatality: Elderly Woman Kil... Hamirpur Job Scam: Authorities Probe ₹... Rs 58.79 crore approved for new drinki...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

కళ్యాణదుర్గం నియోజకవర్గం లో ఐదు ఎంపీపీ స్థానాలు మహిళలకే

✍️ Reporter: Kande Linga Prasad 🗓 19 Nov 2026, 09:28 PM 👁 30
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఐదు మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. ఐదు మండలాల్లోనూ మహిళలే ఎంపీపీలుగా ఎన్నిక కావడం విశేషం. వైస్ ఎంపీపీ ఎంపికల్లో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యతనిచ్చారు. గురువారం నాలుగు మండల కేంద్రాల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగాయి. కళ్యాణదుర్గం మండలంలో మాత్రం ఎంపీపీ ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడింది.
ఎన్నికైన ఎంపీపీ అభ్యర్థులకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు బీ-ఫారాలు అందజేశారు. అనంతరం ఆయా మండలాల్లో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, కూటమి నాయకుల సమక్షంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు నిర్వహించారు. రిజర్వేషన్ల ప్రకారం శెట్టూరు, కంబదూరు మండలాల్లో ఎంపీపీ పదవులు ఎస్సీ జనరల్‌కు కేటాయించినప్పటికీ మహిళలే ఎన్నికయ్యారు.మండలాల వారీగా ఎన్నికైనవారు. కళ్యాణదుర్గం: దురదకుంట ఎంపీటీసీ సభ్యురాలు ఘంటా శశికళ (కమ్మ), తూర్పుకోడిపల్లి ఎంపీటీసీ సభ్యురాలు సింధుశ్రీ (కమ్మ) మధ్య ఎంపీపీ పదవికి పోటీ నెలకొంది. ఈ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసేందుకు తుది నిర్ణయం పెండింగ్‌లో ఉంది. సాయంత్రానికి నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. తిమ్మసముద్రం ఎంపీటీసీ సభ్యురాలు దాసరి పూర్ణిమ (కురుబ) వైస్ ఎంపీపీగా ఎంపికయ్యారు.
కుందుర్పి: బెస్తరపల్లి ఎంపీటీసీ సభ్యురాలు జె. మంజుల (లింగాయత్) ఎంపీపీగా ఎన్నికయ్యారు. కుందుర్పి-1 ఎంపీటీసీ సభ్యుడు ఎస్. వెంకటేశులు (బీజేపీ, పాల ఏకిల – బీసీ-డి) వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు.కంబదూరు: గుదెళ్ల ఎంపీటీసీ సభ్యురాలు తిమ్మక్క (ఎస్సీ) ఎంపీపీగా ఎన్నికయ్యారు. నూతిమడుగు ఎంపీటీసీ సభ్యుడు దేవేంద్ర (గొల్ల) వైస్ ఎంపీపీగా ఎంపికయ్యారు. బ్రహ్మసముద్రం: భైరవానితిప్ప ఎంపీటీసీ సభ్యురాలు కె. లావణ్య (కురుబ) ఎంపీపీగా ఎన్నికయ్యారు. ముప్పులకుంట ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మీబాయి (ఎస్టీ) వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు.శెట్టూరు: ములకలేడు ఎంపీటీసీ సభ్యురాలు నడిమింటి రామలక్ష్మి (ఎస్సీ) ఎంపీపీగా ఎన్నికయ్యారు. మాకొడికి ఎంపీటీసీ సభ్యుడు మనోహర్ (గాజుల బలిజ) వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు.
కళ్యాణదుర్గం మండలంలో ఎంపీపీ ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడాల్సి ఉండగా, మిగిలిన నాలుగు మండలాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో నూతన పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.
📲Get App