కలెక్టర్ చేతుల మీదుగా పాలవాగు గిరిజన పాఠశాల నూతన భవనం ప్రారంభం
సిరికొండ: మండలంలోని పాలవాగు గ్రామంలో గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల నూతన భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఈ భవనం ప్రారంభం కానుంది. ఒకప్పుడు పూరి గుడిసెలో కొనసాగిన పాఠశాల నేడు అందమైన పక్కా భవనంగా రూపుదిద్దుకోవడం గ్రామస్తుల్లో ఆనందం నింపింది. నూతన భవనంతో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం అందనుంది. ఈ నిర్మాణం గ్రామ విద్యాభివృద్ధిలో మరో ముందడుగుగా నిలవనుంది.