🔥 TRENDING 73-Year-Old Telangana Bypass Survivor... અંબાજીમાં ધરમસિંહ પકોડીનું ઉદ્ઘાટન, સ્... જિયો નેટવર્કની સમસ્યા છ મહિના સુધી કવા... Andhra Pradesh set to become a new hub... Dr Anil Kumar Takes Charge as TSRTC Vi... Berhampur University scientists discov...
16 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

కూటమి సర్పంచ్ అభ్యర్థిగా నాగమణి.. గిడ్డి ఈశ్వరితో మర్యాదపూర్వక భేటీ!

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 16 Nov 2026, 01:44 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పసుపులేటి నాగమణి నిలిచారు. ఈ నేపథ్యంలో టీడీపీ జిల్లా ఇంచార్జి గిడ్డి ఈశ్వరిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. గతంలో ఎంపీటీసీ సభ్యురాలిగా పనిచేసిన అనుభవం కలిగిన నాగమణి, ఈసారి సర్పంచ్‌గా ప్రజల ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల పరిస్థితులు, ప్రచార వ్యూహాలు, కూటమి విజయావకాశాలపై చర్చించినట్లు సమాచారం. నాగమణి అభ్యర్థిత్వంతో గూడెం కొత్తవీధి పంచాయతీలో ఎన్నికల రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది.
📲Get App