🔥 TRENDING शहडोल के विकास को नई गति, हवाई अड्डे व... India starts batting in 5th ODI agains... Congress MLA Harish Dhami Smashes Stag... உருவானது புயல் NIFT 2027 Registration Extended to Nov... लखनऊ मंडल के 50 हजार युवाओं को आज मिले...
15 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

సేవా కార్యక్రమాల్లో ముందుంటున్న ముక్కలి మహేష్ కుటుంబం! విద్యార్థులు, యువత, మహిళలు, రైతులకు చేయూత.. పలువురి ప్రశంసలు

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 15 Nov 2026, 07:32 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
సామాజిక సేవే లక్ష్యంగా జీకే వీధికి చెందిన మాజీ జిల్లా టీడీపీ కార్యదర్శి ముక్కలి మహేష్ కుటుంబ సభ్యులు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి. అల్లూరి సీతారామరాజు యువజన రైతు మహిళ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వివిధ వర్గాల ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ తమ సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నారు.ఈ కార్యక్రమాల్లో భాగంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విద్యా సామగ్రి, యువతకు వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు. మహిళలకు చీరలు, జాకెట్లు అందజేయడంతో పాటు రైతులకు నాణ్యమైన అల్లం, పసుపు విత్తనాలు, వివిధ రకాల మొక్కలను పంపిణీ చేశారు.విద్యార్థుల చదువుకు ప్రోత్సాహం, యువతలో క్రీడాస్ఫూర్తి పెంపు, మహిళలకు అండగా నిలవడం, రైతులకు వ్యవసాయపరమైన తోడ్పాటు అందించడం వంటి కార్యక్రమాల ద్వారా ఈ కుటుంబం సమాజ సేవలో భాగస్వామ్యమవుతోంది.
రాజకీయాలకు అతీతంగా ప్రజల అవసరాలను గుర్తించి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని వివిధ గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. ముక్కలి మహేష్ కుటుంబం అందిస్తున్న సహకారం మరెందరికో స్ఫూర్తిదాయకమని కొనియాడుతున్నారు.
📲Get App