🔥 ट्रेंडिंग ಬಿಸಿಸಿಐ ಟಿ20 ನಾಯಕತ್ವ ಬದಲಾವಣೆಗೆ ಶ್ರೇಯಸ್... ಸೆನ್ಸಾರ್ ಆಕ್ಷೇಪಣೆಯಿಂದ 'O.M Operation M... मिरचाईबाड़ी में गोकुलधाम छठ पूजा समिति... लखनऊ में 25 लाख टैबलेट वितरित, युवाओं... ಡಿಸೆಂಬರ್‌ನಲ್ಲಿ ಸ್ಯಾಂಡಲ್‌ವುಡ್‌ನಲ್ಲಿ ಬಿಡ... भोपाल में मेट्रो समय सारणी बदली, डिजिट...
15 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

బొజ్జుగూడలో వీవో భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన సర్పంచ్ నర్వటే ఈశ్వర్

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 15 नव. 2026, 05:32 PM 👁 24
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఇచ్చోడ: మండలంలోని దాబా (బి) గ్రామపంచాయతీ పరిధిలోని బొజ్జుగూడ గ్రామంలో మహిళా సంఘాల కోసం నూతన వీవో (విలేజ్ ఆర్గనైజేషన్) భవన నిర్మాణానికి ఆదివారం భూమిపూజ నిర్వహించారు. సర్పంచ్ నర్వటే ఈశ్వర్ ప్రత్యేక పూజలు చేసి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. నూతన భవనం అందుబాటులోకి రావడంతో మహిళా సంఘాల సభ్యులకు సమావేశాలు నిర్వహించుకోవడానికి, పొదుపు, రుణాలు, ఇతర సంఘ కార్యకలాపాలు కొనసాగించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీహరి, గ్రామ పటేల్ మెస్రం చిత్రు,జాదవ్ ఆనంద్ రావు, కాక్డే మారుతి, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
📲Get App