🔥 TRENDING Bollywood Under Fire for Mocking South... Bigg Boss Kannada Season 13 Contestant... Dutch Prisons to Shut Down Amid Reform... Prasoon Joshi urges Uttarakhand diaspo... Uttarakhand TET 2026 Result Now Availa... DRI confiscates 10.8 kg of amphetamine...
15 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

జీకే వీధి సర్పంచ్ బరిలో టీడీపీ అభ్యర్థిగా ముక్కలి కళ్యాణి! గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల పోటీకి ప్రకటన

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 15 Nov 2026, 07:43 AM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలంలో సర్పంచ్ ఎన్నికల రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా ముక్కలి కళ్యాణి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల ఆశీస్సులు, పార్టీ శ్రేణుల సహకారంతో ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ఆమె వెల్లడించారు.ఈ సందర్భంగా కళ్యాణి మాట్లాడుతూ గ్రామ సమగ్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. అవినీతికి తావులేకుండా పారదర్శక పాలన అందించడంతో పాటు ప్రతి కుటుంబ సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ అందరినీ కలుపుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని తెలిపారు.ఈ సందర్భంగా టీడీపీ పార్టీ శ్రేణులు మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల్లో ముక్కలి కళ్యాణికి మద్దతుగా నిలవాలని, సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఆమెకు మద్దతు తెలియజేయాలని గ్రామ ప్రజలను కోరారు.
📲Get App