బాలల హక్కుల పరిరక్షణే లక్ష్యం.. ధాబా (బి)లో ప్రత్యేక బాలల గ్రామసభ
ఇచ్చోడ: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇచ్చోడ మండలంలోని ధాబా (బి) గ్రామ ప్రాథమిక పాఠశాలలో ప్రత్యేక బాలల గ్రామసభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నర్వటే ఈశ్వర్ మాట్లాడుతూ.. బాలల అభిప్రాయాలకు ప్రాధాన్యత కల్పించడం, వారి హక్కులపై అవగాహన పెంపొందించడం, ఉజ్వల భవిష్యత్తుకు సమాజం బాధ్యతగా నిలవడం ఈ గ్రామసభ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పిల్లల సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకుని వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.