🔥 TRENDING ACS Orders Timely Clearance of Pending... Odisha Government Calls High-Level Mee... OrissaPOST November 14 Horoscope: Sagi... Andhra Pradesh Leads India’s Rooftop S... Namasthe World signs MoU with Andhra P... Gold price slips below ₹1.36 lakh, dow...
14 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

మన్యం బిడ్డకు రాష్ట్రపతి భవన్ పిలుపు.. జాతీయ వేదికపై మెట్టపాటి చిన్నబాబుకు అరుదైన అవకాశం!

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 14 Nov 2026, 07:22 AM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంతానికి చెందిన విద్యార్థి మెట్టపాటి చిన్నబాబు జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు పొందాడు. గూడెంకొత్తవీధి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యనభ్యసించిన చిన్నబాబు హ్యుమానిటీస్ విభాగంలో 92.4 శాతం మార్కులు సాధించి ప్రతిభ చాటుకున్నాడు. ఈ ప్రతిభకు గుర్తింపుగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించనున్న జనజాతీయ గౌరవ దివస్ ప్రత్యేక వేడుకలకు హాజరుకావాలని ఆహ్వానం అందడం విశేషం.మారుమూల గిరిజన ప్రాంతం నుంచి వచ్చి విద్యలో ప్రతిభ కనబరచడమే కాకుండా దేశ అత్యున్నత వేదికపై జరిగే జాతీయ కార్యక్రమానికి ఆహ్వానం పొందడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్నబాబు సాధించిన ఈ గుర్తింపు ఏజెన్సీ ప్రాంత విద్యార్థుల్లో నూతన స్ఫూర్తిని నింపుతోంది.
తమ పాఠశాల విద్యార్థికి రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందడంపై ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందనలు తెలిపారు. చిన్నబాబు పట్టుదల, క్రమశిక్షణ ఇతర విద్యార్థులకు ఆదర్శమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు సైతం తమ కుమారుడి విజయంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించి గిరిజన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని మండల ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
📲Get App