నిర్మల్ రైతు గర్జన సభకు బయలుదేరిన దాబా బి సర్పంచ్, బీఆర్ఎస్ నాయకులు.
నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈరోజు సాయంత్రం నిర్వహించనున్న రైతు గర్జన సభకు దాబా బి గ్రామ సర్పంచ్ నర్వటే ఈశ్వర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానుండటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.