🔥 TRENDING Bihar authorities seize 700 bags of fa... Indore ranks second most polluted Indi... रानोली में क्रिकेट प्रतियोगिता शुरू, क... તલોદના વક્તાપુર ગામના યુવા ક્રિકેટર શા... भंडारी गांव से कुठिला बालाजी की 9वी ं... बिचपुरी मे ं पप्पू योगी के घर मे ं आग...
09 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

జిల్లా పరిషత్ పగ్గాలు జీకే వీధికి ఇవ్వాలి! జడ్పీ చైర్మన్‌గా కంకిపాటి గిరి ప్రసాద్‌కు అవకాశం కల్పించాలంటున్న స్థానికులు

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 09 Nov 2026, 08:36 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఈసారి జీకే వీధి ప్రాంతానికి కేటాయించాలనే డిమాండ్ స్థానికంగా బలంగా వినిపిస్తోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున జీకే వీధి జడ్పీటీసీగా కంకిపాటి గిరి ప్రసాద్ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో ఆయనకు జిల్లా పరిషత్ చైర్మన్‌గా అవకాశం కల్పించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. జీకే వీధి మండలంలో మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలకు గాను 14 స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుచుకోవడం పార్టీకి పెద్ద విజయంగా నిలిచింది. ఈ విజయంతో పాటు గిరి ప్రసాద్ వ్యక్తిగతంగా 4,500కు పైగా ఓట్ల మెజారిటీ సాధించడం ఆయన రాజకీయ బలాన్ని చాటింది.రంపుల గ్రామానికి చెందిన గిరి ప్రసాద్‌కు రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. ఆయన తండ్రి కంకిపాటి బాలయ్య పడాలు , చిన్నాన్నకంకిపాటి రాజారావు గతంలో స్థానిక సంస్థల పదవుల్లో పనిచేశారు. 2018లో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆయన 2020 నుంచి 2024 వరకు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా, 2024 నుంచి జీకే వీధి మండల పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో కీలకంగా వ్యవహరించారు.ఇదిలా ఉండగా, అల్లూరి జిల్లాలోని 11 జడ్పీటీసీ స్థానాలకు గాను వైఎస్సార్‌సీపీ ఏడు స్థానాలను దక్కించుకుంది. దీంతో చైర్మన్ పదవి ఎంపికపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. గతంలో చైర్‌పర్సన్ పదవిపై ఇచ్చిన హామీ అమలుకాకుండా అరకు ప్రాంతానికి అవకాశం దక్కిన నేపథ్యంలో, ఈసారి జీకే వీధి ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.
స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు గడుస్తున్నా జీకే వీధి, చింతపల్లి, కొయ్యూరు ప్రాంతాలకు చెందిన వారికి ఇప్పటివరకు జడ్పీ చైర్మన్ పదవి దక్కకపోవడం విచారకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. వెనుకబడిన గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలంటే ఈ ప్రాంతానికి చెందిన నాయకుడికి ఉన్నత పదవి ఇవ్వడం సముచితమని పేర్కొంటున్నారు. పార్టీ కోసం కష్టపడిన అనుభవం, ఎన్నికల్లో సాధించిన విజయం, స్థానిక ప్రజల మద్దతును పరిగణనలోకి తీసుకుని కంకిపాటి గిరి ప్రసాద్‌కు జడ్పీ చైర్మన్‌గా అవకాశం కల్పించాలని వైఎస్సార్‌సీపీ అధిష్టానాన్ని స్థానిక నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు. చివరకు పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
📲Get App