ఆదిలాబాద్ రిమ్స్ లో నవజాత శిశువు మృతి
ఆదిలాబాద్ రిమ్స్ నవజాత శిశువు మృతి ఘటన కలకలం రేపింది. గుడిహత్నూర్ మండలం తోషం గ్రామానికి చెందిన షేక్ సీమ ప్రసవం కోసం శుక్రవారం రిమ్స్‌లో చేరారు. వైద్యులు సిజేరియన్ చేయగా మగబిడ్డ జన్మించింది. శనివారం తెల్లవారుజామున శిశువు మృతి చెందగా, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణమని కుటుంబీకులు ఆరోపించారు. స్పందించిన డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ వారితో మాట్లాడుతూ.. ఘటనపై విచారణ కమిటీ నియమిస్తామని హామీ ఇచ్చారు.