शिक्षा
జేఎన్టీయూ హైదరాబాద్ కి ప్రపంచ స్థాయి గుర్తింపు.
यहाँ देखें:
▶️ YouTube
హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక కళాశాలల్లో ఒకటైన జేఎన్టీయూ కి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. సాంకేతిక విద్యకు పెట్టింది పేరుగా ఉన్న నగరంలోని జేఎన్టీయూ కి ఈ గౌరవం దక్కడంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు.
క్యూఎస్ సంస్థ తాజాగా ప్రకటించిన ఆసియా ర్యాంకింగ్ లో జేఎన్టీయూ అంతర్జాతీయ విద్యాసంస్థల సరసన చేరి తన సత్తా చాటుకుంది. ప్రముఖ అంతర్జాతీయ ఉన్నత విద్యాసంస్థల విశ్లేషణ సంస్థ క్యూఎస్ తాజాగా చేసిన సర్వే ఆధారంగా ప్రకటించిన ఆసియా ర్యాంకింగ్ లో జేఎన్టీయూ అంతర్జాతీయ విద్యా సంస్థల సరసన చేరి అందరినీ అబ్బుర పరిచింది. ఆసియా దేశాల్లో 3,600 కు పైగా విద్యా సంస్థలను విశ్లేషించిన ఈ సంస్థ జేఎన్టీయూ కి 1,200 నుంచి 1,300 బ్యాండ్ లో ర్యాంకు ను ప్రకటించింది. జేఎన్టీయూ కి తొలిసారిగా క్యూ ఎస్ ర్యాంకు లభించడం పై వైస్ ఛాన్సలర్ డాక్టర్ టి కిషన్ కుమార్ రెడ్డి, రెక్టార్ దామోదరం, రిజిస్ట్రార్ జయలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ లోని ఆచార్యులు, విద్యార్థులు, సిబ్బంది సమష్టి కృషికి నిదర్శనమని చెప్పారు. భవిష్యత్తులో మరింత కృషి చేసి మరింత మెరుగైన స్థానాన్ని దక్కించుకుంటామని తెలియజేశారు.