జీకే వీధి కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసుల అప్రమత్తత స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించి భద్రతా చర్యలపై ఏఎస్పీ సమీక్ష
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో గూడెం కొత్తవీధి మండలంలో పోలీసు భద్రతను మరింత పటిష్టం చేశారు. ఈ క్రమంలో చింతపల్లి ఏఎస్పీ నిరంజన్ మహోంద సిన్హా శుక్రవారం సాయంత్రం జీకే వీధి గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలోని స్ట్రాంగ్ రూమ్‌ను సందర్శించి భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
మండలంలోని 18 ఎంపీటీసీ స్థానాలు, ఒక జడ్పీటీసీ స్థానానికి సంబంధించిన బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌లో కట్టుదిట్టమైన భద్రత మధ్య భద్రపరిచారు. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగేలా చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించిన ఏఎస్పీ, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎన్నికల అధికారులు, సీఐ, ఎస్సై తదితరులు పాల్గొన్నారు.